Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan Picks 200 T20I Wickets: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాటర్ తడివనాషే మరుమానిని ఔట్ చేయడం ద్వారా రషీద్ ఖాతాలో 200వ వికెట్ చేరింది. దీంతో టీ20 క్రికెట్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20 క్రికెట్లోనూ రషీద్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. 551 మ్యాచ్‌ల్లో 742 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రషీద్ ఖాన్ అఫ్గానిస్థాన్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా జింబాబ్వేతో రెండో టీ20లో తడివనాషే మరుమానిని పెవిలియన్‌కు పంపించి 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 120 ఇన్నింగ్స్‌ల్లో రషీద్ ఈ మైలురాయిని అందుకున్నాడు. అతడి ఖాతాలో రెండు ఐదు వికెట్ల హాల్స్ ఉన్నాయి. టీ20ల్లో 5/3 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్‌ను అందుకున్న క్రికెటర్‌గానూ రషీద్ చరిత్రకెక్కాడు.
Also Read
- IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
- Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
- Akash Chopra: ధోనీని దుర్భాషలాడిన CSK స్టార్ ప్లేయర్.. ఆ సమయంలో జరిగింది ఇదే..
- Bancroft: బాల్ ట్యాంపరింగ్ అందరికీ తెలుసు.. ఆస్ట్రేలియా బండారం బయటపెట్టిన బ్యాన్‌క్రాఫ్ట్..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ ఒక దశలో 38 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, మహమ్మద్ అక్రమ్, షాహిదుల్లా కమాల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సేదికుల్లా అటల్ 21 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్జాయ్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు కేవలం 59 బంతుల్లోనే 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో అఫ్గానిస్థాన్ మళ్లీ పోటీలోకి వచ్చింది. ఇజాజ్ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా చివర్లో బ్యాట్‌తో మెరిశాడు. కేవలం ఆరు బంతుల్లోనే అజేయంగా 25 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యానికి జింబాబ్వే 19 పరుగుల దూరంలో ఆగింది.
టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)-120 ఇన్నింగ్స్‌ల్లో 200 వికెట్లు
ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)-146 ఇన్నింగ్స్‌ల్లో 171 వికెట్లు
ఎహ్సన్ ఖాన్ (హాంకాంగ్ )-116 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
ఇష్ సోదీ (న్యూజిలాండ్ )-135 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
టిమ్ సౌథీ (న్యూజిలాండ్)-123 ఇన్నింగ్స్‌ల్లో 164 వికెట్లు
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
NTR Dragon: ‘ధురంధర్’ ఫార్ములాను ఫాలో అవుతున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’!
-
Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
-
Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
-
Gopichand: విలన్‌గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..