School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holiday Extended in Konaseema: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవులను మరోసారి పొడిగించారు. నేడు కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా మంగళవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతుండగా.. పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సెలవు పొడిగింపుపై ప్రకటన చేశారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు పాఠశాలల ప్రాంగణాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. వాటిని ఇంకా పూర్తిస్థాయిలో తొలగించకపోవడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవులు పొడిగించారు. చెట్ల తొలగింపు, పాఠశాల ప్రాంగణాల శుభ్రత పనులు పూర్తికాకపోవడం కూడా ఈ నిర్ణయానికి మరో కారణం. మరోవైపు తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరణ కాలేదు. దీంతో పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, తాగునీటి సమస్యల నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించడం సాధ్యంకాదని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
- Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
- మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి సెలవును ప్రకటించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి, పాఠశాలల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే తరగతుల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. మంగళవారం సాయంత్రం నుంచి జిల్లావ్యాప్తంగా పెను ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురవడంతో.. జనజీవవం పూర్తిగా అస్తవ్యస్తమైంది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తాజావార్తలు
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!