బీదర్, అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల కర్ణాటకలోని బీదర్ ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్ దగ్గర ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి రూ.93 లక్షలు ఎత్తుకుని పరారయ్యారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతరం నిందితులు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో ప్రత్యక్షమయ్యారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై నిందితులు కాల్పలు జరిపి రాయ్‌పూర్ వైపు పరారయ్యారు. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. అయితే ఇరు రాష్ట్రాల పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ గ్యాంగ్ అమిత్ గ్యాంగ్‌నా? మనీష్ గ్యాంగ్‌నా తర్జనభర్జన పడ్డారు. తీరా ఈ రెండు గ్యాంగ్‌లు కాదని నిర్ధారించుకున్నారు.
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunam: 200 కోట్లు.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
అయితే ఈ కేసు నాలుగు రాష్ట్రాల పోలీసులకు బిగ్ టాస్క్‌గా మారింది. దుండగులు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు డాక్యుమెంట్స్, తప్పుడు వివరాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మనీష్ గ్యాంగ్‌గా బీహార్ పోలీసుల సమాచారం మేరకు ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించారు. అనంతరం బీహార్ పోలీసులు బీదర్ పోలీసుల సీసీ ఫుటేజీ ఫొటోలను మనీష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు చూపించడంతో ఆ ఫొటో మనీష్‌ది కాదని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ స్టోరీ మళ్లీ మొదటికి వచ్చింది.
దుండగులిద్దరూ పథకం ప్రకారం మొత్తం ఆపరేషన్‌లో ఒక్క సారి కూడా మొబైల్ ఫోన్ వాడకుండా జాగ్రత్త పడ్డారు. దోపిడీ చేసిన డబ్బును పెట్టడానికి బ్యాగులు, బట్టలు, హోటల్ బిల్లులు, ట్రావెల్ టికెట్ దగ్గర నుంచి ఫుడ్ తిన్న ప్రతి సందర్భంలో కూడా కేవలం క్యాష్ మాత్రమే వాడారు. ఎక్కడ కూడా ఆన్‌లైన్’లో ఒక్క సారి కూడా పేమెంట్ చేయకుండా ముందు జాగ్రత్తతో ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు.నిందితులు మొబైల్ ఫోన్ వాడకపోవడం కూడా పోలీసులకు దర్యాప్తులో ఇబ్బందిగా మారింది. తెలంగాణ, కర్ణాటక, బీహార్, చత్తీస్‌గడ్ పోలీసులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నిందితుల వివరాల తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా నింధితుల కోసం బీహార్, ఉత్తర ప్రదేశ్, రాయ్‌పూర్‌లో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బీదర్‌తో పాటు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల సీసీ టీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగానే దుండగులను గుర్తించే పనిలో పడ్డారు.
ఇది కూడా చదవండి: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ