Maredumilli–Chintur Ghat Road: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి–చింతూరు ఘాట్ రోడ్డులో ఈ రాత్రి నుండి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్యాసింజర్ బస్సులు రాకపోకలు నిలిపి వేయనున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత.. చింతూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Also: Bhatti Vikramarka : మరింత బలపడనున్న తెలంగాణ-జర్మనీ సంబంధాలు
బస్సు ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని, చింతూరు ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు, ఐదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మృతులు కుటుంబాలకు ఏడు లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల 50 వేల రూపాయాలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడటమే ప్రమాదానికి గురి కారణాలుగా చెప్పారు. పొగ మంచు కారణంగా బస్సు బోల్తా పడి ఉండొచ్చునని వచ్చే నవంబర్ వరకు బస్సుకు రవాణా శాఖ జారీచేసిన ఫిట్‌నెస్ ఉందని అన్నారు.. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమిస్తామని అన్నారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..