Site icon NTV Telugu

Minister Anagani: కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ బీసీల చేతుల్లోనే ఉన్నాయి‌‌..

Anagani

Anagani

Minister Anagani: తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్, సవిత, సత్య కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు. ఇక, మంత్రి అనగాని సత్య ప్రసాద్ బీసీ నేతలు సన్మానించారు.

Read Also: F-35B Fighter Jet: కేరళలో దిగిన ఎఫ్-35 జె‌ట్‌కి ‘‘పాన్ కార్డ్’’, ‘‘ఆధార్ కార్డ్’’.. మీమ్స్‌తో నవ్వులే నవ్వులు..

ఈ సందర్భంగా మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాల్లో బీసీలకు అగ్ర పీఠ వేస్తుంది.. కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ బీసీ నేతల చేతుల్లోనే ఉన్నాయి‌‌.. కేంద్రం కుల గణన ప్రారంభించిందంటే అందుకు కారణం చంద్రబాబు.. కుల గణన ద్వారా బీసీలకు ఎంత మేలు జరుగుతుందో తెలుస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.

Exit mobile version