Agnipath Scheme: ఏపీలోని 13 జిల్లాల నిరుద్యోగులకు గమనిక.. విశాఖలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీని విశాఖలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అగ్నివీరుల ఎంపికలు ఉంటాయని ప్రకటించారు. ఏపీలోని 13 జిల్లాలు, యానాం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, యానాం ప్రాంతం వారు ఈ రిక్రూట్ మెంట్‌లో పాల్గొనవచ్చని సూచించారు.
Read Also: Nagpur: ప్రియురాలితో శృంగారం చేస్తూ చనిపోయిన 28 ఏళ్ల యువకుడు
Also Read
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 30 వ తేదీలోగా రిక్రూట్ మెంట్ ర్యాలీ రిజిస్ట్రేన్ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులు ఆన్ లైన్ ద్వారా జారీ చేస్తామన్నారు. ఆర్మీ కాలింగ్ మొబైల్ యాప్ ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉందన్నారు. విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయానికి 0891-2756959,0891-2754680 నంబర్ల ద్వారా ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు సోమవారం నాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వచ్చేవారం ఈ వ్యవహారంపై వాదనలు విననున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.
తాజావార్తలు
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..