Praveen Kumar Killed His Frien Seenu For Having Affair With Aunty In Tamilnadu: స్నేహితులు ఎంత కలిసికట్టుగా ఉంటారో, కుటుంబ సభ్యుల్ని సైతం అలాగే ఆదరిస్తారు. ఇరువురి ఫ్యామిలీ మెంబర్స్‌ని అభిమానిస్తారు. కానీ.. కొందరు మాత్రం దారి తప్పి, తప్పుడు పనులకు పాల్పడుతుంటారు. ఇప్పుడు ఓ ఫ్రెండ్ కూడా అలాంటి తప్పే చేశాడు. తన స్నేహితుడి అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం గ్రామ పంచాయితీ దాకా వెళ్లడంతో, పరిస్థితి చెయ్యి దాటేసింది. నమ్మిన స్నేహితుడే పాడు పని చేయడంతో తట్టుకోలేక.. అతడ్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
CM YS Jagan: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధాని మోడీతో చర్చించే అంశాలు ఇవే!
నామక్కల్ జిల్లా వెలగౌండంపట్టిలోని అక్కలంపట్టి అరుంధతీ కాలనీకి చెందిన శీను (23), ప్రవీణ్‌కుమార్ (21) మంచి స్నేహితులు. వీరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. ఒకరి ఇంటికి మరొకరు వెళ్తారు. తమ సొంత పిల్లాల్లానే ఇరువురి కుటుంబ సభ్యులు చూసుకుంటారు. అయితే.. శీను మాత్రం దారి తప్పాడు. ప్రవీణ్ కుమార్ అత్త అయిన మీనా (మేనమామ సత్య భార్య)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు శీను, మీనా గుట్టుగా తమ రాసలీలలు కొనసాగించారు. అయితే.. ఓరోజు వీళ్లిద్దరు మీనా భర్త సత్యకు అడ్డంగా దొరికిపోయారు. దాంతో కోపాద్రిక్తుడైన సత్య.. భార్యని మందలించాడు. అలాగే.. మరోసారి తమ ఇంటి వద్దకు రావొద్దని వార్నింగ్ ఇచ్చాడు. అయినా.. ఆ ఇద్దరిలో మార్పు రాలేదు. దీంతో.. ఈ వ్యవహారం పంచాయితీ దాకా వెళ్లింది. ఆ పంచాయితీలో.. మీనా, శీను కలవకూడదని పెద్దలు తీర్పునిచ్చారు.
Manipur Reopens Schools: మణిపూర్‌లో పునః ప్రారంభమైన స్కూల్స్.. మొదటి రోజు తక్కువ హాజరు
అయితే.. ప్రవీణ్ కుమార్ మాత్రం శీనుపై పగ పెంచుకున్నాడు. అతడు చేసిన పని వల్ల తన మేనమామకు, అత్తకు చెడ్డ పేరు వచ్చిందని.. శీనును చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. సోమవారం రాత్రి శీను ఇంటికి వెళ్లి, బయట నిద్రిస్తున్న అతనిపై కత్తితో దాడి చేశాడు. శీను మెడ, ఛాతి, తొడలపై కత్తితో పొడిచి.. కిరాతకంగా హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. శీను అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు కానీ, అప్పటికే అతడు మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పారిపోయిన ప్రవీణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.