ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం… తప్పిన ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. అయితే ప్రయాణికులంతా బస్సులో నుంచి వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుంది గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.
దీంతో అంతా బస్సులోని నుంచి దూకి ప్రాణాలకు కాపాడుకున్నారు. మంటలు బస్సు మొత్తం అంటుకుని అగ్నికి ఆహుతయింది. అయితే ప్రయాణికుల సామగ్రి కూడా బస్సులోనే కాలి బూడిదయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు బస్సు సిబ్బంది తెలిపారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!