Viral Video: కర్నూలు బస్సు ప్రమాదం యావత్ తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నటేకూరు వద్ద బస్సు బైకును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బస్‌లో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.…
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సఫీపూర్ కొత్వాలి ప్రాంతంలోని జమాల్దీపూర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో బంగార్మావు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సును ముందు నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Nizamabad: ఓ ప్రైవేట్ బస్సులో సినీమా స్టైల్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. టీ తాగడం కోసం బస్సు ఆపితే ఓ బ్యాగులోనుంచి 13 లక్షలు కొట్టేశారు గుర్తు తెలియని దొంగలు.
పండుగలు వచ్చిందంటే చాలు.. యథేచ్ఛగా ప్రైవేటు ప్రజారవాణా సంస్థలు డబ్బులు దండుకోవడానికి సిద్ధమవుతుంటాయి. ప్రైవేటు ట్రావెల్స్ ధనదాహానికి సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డుపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాటిపై అధికారుల బృందం కేసులు నమోదు చేస్తోంది. అంతేకాకుండా సంక్రాంతి పండుగ నేపథ్యంలో…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయింది. అయితే ప్రయాణికులంతా బస్సులో నుంచి వెంటనే కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుంది గురువారం తెల్లవారుజామున తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్రహించిన బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా బస్సులోని నుంచి…