National Lok Adalat: ఏపీ వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్.. 94,263 కేసుల పరిష్కారం
National Lok Adalat: ఏపీ వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ స్పందన లభించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 380 లోక్ అదాలత్ బెంచ్‌లు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 94,263 కేసులు పరిష్కారం అయినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 87,805 పెండింగ్, 6,458 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు వివరించారు. ఆయా కేసుల పరిష్కారం ద్వారా అధికారులు రూ.93.07 కోట్ల పరిహారం అందజేశారు. రాజీకి అవకాశం ఉన్న పలు కేసుల్ని ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వకంగా పరిష్కరించారు.
Read Also: Robbery in Nizamabad: మిఠాయి తినిపించి.. కాళ్లు, చేతులు కట్టేసి రూ.30వేలు దోపిడీ..
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
తూ.గో. జిల్లా పెద్దాపురం కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 320 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 21,క్రిమినల్ కేసులు 286, బ్యాంకు కేసులు 13 పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్ నిర్వహణకు మూడు బెంచ్‌లు ఏర్పా టుచేశారు. అటు అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.సురేఖరెడ్డి లోక్ అదాలత్ బెంచ్‌లను నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 451 కేసులు పరిష్కరించి రూ.3.34 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేశారు. కాగా లోక్ అదాలత్‌కు సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!