Andhra Pradesh: దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారత్ దేశాన్ని కదిలించిన దివి సీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుపానుతో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14వేలకు పైగా ప్రజలు మరణించారు. అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గుట్టలుగా శవాలు పేరుకుపోయాయి. లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. అప్పట్లోనే సుమారు రూ.172 కోట్ల నష్టం సంభవించింది.
అసలు ఏం జరిగింది?
1977 నవంబర్ 18న అండమాన్ నికోబార్ దీవులు వద్ద తీరానికి 520 కిమీల వద్ద అల్పపీడనం ఏర్పడి తరువాత తుఫానుగా రూపాంతరం చెందింది. గంటకు 170 కిమీల వేగంతో దిశలు మార్చుకుంటూ తుఫాను ప్రయాణం చేసింది. ఇది మన సముద్ర తీరానికి 140 కిమీల దూరంలో ఉండగా వాతావరణ శాఖ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కాని అప్పటికే ఆలస్యమైంది. అప్పటికి ఇంకా సమాచారం, సాంకేతిక రంగం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకోలేదు. దీనితో అపార నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే మర్నాడు అంటే నవంబర్ 19న నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన తుఫాను బీభత్సం సృష్టించింది. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మూడు తాటిచెట్ల ఎత్తులో సముద్ర కెరటాలు ప్రళయం సృష్టించాయి. అనేక గ్రామాలపై దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. గాలి బీభత్సంతో పాటు రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
దివిసీమ ఉప్పెనతో నష్టపోయిన ప్రజలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వపరంగా ఆదుకున్నారు. అనేక స్వచ్చంద సంస్థలు కూడా తమ వంతుగా బాధితులకు సాయం అందించాయి. ఎవరు ఎంత సాయం చేసినా కోలుకోలేని విలయం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దివిసీమ ఉప్పెన తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను అధికారులు తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!