గోదారోళ్లతో మాములుగా ఉండదు… అల్లుడికి 365 రకాల వంటకాలతో విందు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి జిల్లాలంటే మర్యాదలకు మారు పేరు. సాధారణంగానే గోదావరి జిల్లాలలో అతిథులకు చేసే మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక సంక్రాంతి అల్లుళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మనవరాలికి, ఆమెకు కాబోయే భర్తకు ఓ తాతయ్య ఇచ్చిన విందు భోజనం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: ఏపీలో సెలవులు పొడిగించే ఆలోచన లేదు: మంత్రి సురేష్
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
నరసాపురానికి చెందిన ఆచంట గోవింద్ నాగమణి దంపతుల కూతురు అత్యం మాధవి, వెంకటేశ్వరరావు దంపతుల ఏకైక కుమార్తె కుందవికి తణుకుకి చెందిన తుమ్మలపల్లి సాయికృష్ణతో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో కాబోయే దంపతులకు.. వధువు తాతయ్య విందు ఏర్పాటు చేసి గోదారోళ్ల మర్యాదను రుచి చూపించారు. సంక్రాంతి సందర్భంగా కాబోయే ఇంటి అల్లుడికి భారీ స్థాయిలో అతిథి మర్యాదలు చేశారు. ఏకంగా 365 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు. వీటిలో అన్నం, పులిహార, బిర్యానీ, దద్దోజనం వంటి వంటకాలతో పాటు, 30 రకాల కూరలు, వివిధ రకాల పిండివంటలు, 100 రకాల స్వీట్లు, 19 రకాల హాట్ పదార్థాలు, 15 రకాల ఐస్ క్రీంలు, 35 రకాల కూల్‌డ్రింక్‌లు, 35 రకాల బిస్కెట్లు, 15 రకాల కేకులు ఉన్నాయి. ఈ వంటకాలను కాబోయే అల్లుడు అలా అలా రుచి చూసి అత్తింటి వారు చూపిన మమకారానికి ఫిదా అయిపోయాడు.

తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!