వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన సినీ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారు.. ఇవాళ మెగా బ్రదర్ నాగబాబును కలిసిన ఆయన.. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాతుర్మాస దీక్ష ముగియగానే.. ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో జనసేన కండువవా కప్పుకుంటారని తెలుస్తోంది.. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట పృథ్వి.. తన స్వస్థలం తాడేపల్లిగూడెం నుంచే ఎన్నికల బరిలో దిగుతారనే చర్చ సాగుతోంది..
Read Also: Basavaraj Bommai: కర్ణాటక ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్.. ఢిల్లీ పర్యటన రద్దు
కాగా, 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నారు కమెడియన్ పృథ్వి రాజ్.. ఆ తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వతా రాజకీయాల్లో ప్రవేశించి తన లక్‌ను పరీక్షించుకున్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో వైసీపీ తరుపున జోరుగా ప్రచారం నిర్వహించాడు.. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు ఏకంగా చైర్మన్ చేసేసాడు. ఆ తర్వాత ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, ఎస్వీబీసీ వ్యవహారంలో ఎవరో గిట్టని వాళ్లు తనను అన్యాయంగా ఇరికించారని వాపోయాడు. తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వర స్వామి దండిస్తారని కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాజకీయాల కారణంగా తాను సినిమా రంగంలో అవకాశాలు తగ్గాయని వాపోయిన పృథ్విరాజ్.. ఒకప్పటిలా తనకు ఎవరు పిలిచి మరి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజకీయాల్లో నా లాంటి ముక్కుసూటి మనిషికి పడవనే విషయం అర్ధమైంది.
తనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి వస్తే.. అంతా ఆ శ్రీవారి కృప అనుకున్నాను. కానీ, నాకు తెలియకుండానే నా వెనకాల గోతులు తీస్తారని ఊహించలేదున్నారు పృథ్వి. జరిగిన పరిణామాలు నాకో గొప్ప గుణపాఠం నేర్పాయి. ఈ రాజకీయాలు కారణంగా అందరూ బాగానే ఉన్నా.. నేను మాత్రం రోడ్డున పడ్డానన్నారు. నాకు అసలు రాజకీయాలే పడవు. వెనకాల కొండను చూసుకొని అంటూ సీఎం వైఎస్ జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఇండస్ట్రీ పెద్దల గురించి కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేశాను. దీంతో ఫుట్‌బాల్ లా ఎక్కడో పోయిపడ్డాను.. త్వరలోనే అందరినీ కలుస్తానంటూ.. గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. మరీ ఇప్పుడు జనసేనలో చేరిన తర్వాత.. మొత్తంగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతారా? అటు సినిమాలు.. రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తారా చూడాలి మరి.