Baby letter to PM Modi: మోడీజీ.. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. ఒకటో తరగతి చిన్నారి లేఖ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: నిత్యావసరాల ధరల పెరుగుదల వల్ల పరోక్షంగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఒకటో తరగతి విద్యార్థిని ఏకంగా ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌ పట్టణానికి చెందిన ఆరేళ్ల చిన్నారి కృతి దూబే ఈ లెటర్‌ని హిందీలో రాసింది. ‘ప్రధానమంత్రి’కి అంటూ ప్రారంభించింది. ‘నా పేరు కృతి దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మోడీజీ.. మీ వల్లే దేశంలో సరుకుల రేట్లు నింగినంటుతున్నాయి. చివరికి నా పెన్సిల్, రబ్బర్ (ఎరేజర్) కూడా ఖరీదయ్యాయి. నేను ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ సైతం ప్రియమైంది.
అందువల్ల నాకు పదే పదే పెన్సిళ్లు కొనివ్వటం మా అమ్మకు కష్టమైపోతోంది. పెన్సిల్ కావాలని అడిగితే చాలు కోప్పడుతోంది. కొడుతోంది. నేనేం చేయాలో అర్థంకావట్లేదు. నా పెన్సిల్నేమో తోటి విద్యార్థులు కొట్టేశారు’ అని లేఖను ముగించి పోస్ట్ చేసింది. కృతి దూబే రాసిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారటంపై ఆమె తండ్రి విశాల్ దూబే స్పందించారు. అది తన కూతురి ‘మన్ కీ బాత్’ అంటూ చమత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెలా ఆఖరి ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) చెబుతుంటారు కదా. దాన్ని విశాల్ పరోక్షంగా ప్రస్తావించారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర
ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కూతురు ఇటీవల పెన్సిల్ పోగొట్టుకోవటంతో తల్లి ఆగ్రహంతో కొట్టిన మాట వాస్తవమేనని చెప్పారు. దీంతో బిడ్డ తీవ్రంగా నొచ్చుకుందని, అందుకే తన బాధను ఈ ఉత్తరం రూపంలో వెల్లడించిందని తెలిపారు. ఈ విషయమై ఛిబ్రమౌ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) అశోక్ కుమార్ కూడా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చిన్నారి లెటర్ రాసిన సంగతి తనకు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారానే తెలిసిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను వ్యక్తిగతంగా ఆ విద్యార్థినికి సాయం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఆ అమ్మాయి రాసిన లెటర్ సంబంధిత అధికారులకు చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని కూడా ఆయన అన్నారు. అయితే ఈ లెటర్‌పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాగీపై వసూలు చేస్తున్న జీఎస్‌టీ నామమాత్రమే (5 శాతమే) అని, సగటు జీఎస్‌టీ 18 శాతమని ఓ వ్యక్తి చెప్పాడు. పెన్సిల్‌పై వేస్తున్న జీఎస్టీ 12 శాతమని, ఇది గతంలోనూ ఉన్న సేల్స్ ట్యాక్సే తప్ప కొత్తగా తెర మీదికి వచ్చింది కాదని స్పష్టం చేశాడు. ఇక, తల్లి బిడ్డను కొట్టిందనేది కట్టుకథేనని, అది పెయిడ్ ఏజెంట్ల కల్పనా చాతుర్యమని ఎద్దేవా చేశాడు.
తాజావార్తలు
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!