సింహం.. అడవికి రాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పరుగులు పెడుతుంది. జింకల్లాంటివి అయితే బతుకు జీవుడా అంటూ దొరక్కుండా పారిపోతాయి. కానీ చిన్న జంతువులు సింహం జోలికి రావు. కానీ ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు చుక్కలు చూపించింది. బాగా ఆటపట్టించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది.
Read Also: Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల సీన్ !
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాలో హల్‌చల్ చేస్తోంది. ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ పేజీలో పోస్టు అయిన ఆ వీడియోకు 4 లక్షలకు పైగానే లైక్‌లు కూడా వచ్చేశాయి. కామెంట్లు హోరెత్తుతున్నాయి. ఓ నది ఒడ్డున నీళ్లు తాగేందుకు వచ్చిందో సింహం. దాహం తీర్చుకోవడానికి నీళ్ళు తాగుతున్న సింహానికి షాకిచ్చింది తాబేలు. అది ఎక్కడికెళితె అక్కడికెళుతూ దాన్ని విసిగించింది. అయితే సింహాం తన మూతి వద్దకు వచ్చిన తాబేలుని చూసి పక్కకు జరిగింది. మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నం చేస్తున్న సమయంలో నీటిలో ఉన్న తాబేలు మరోసారి సింహాం నోటి దగ్గరకు వెళ్లింది. ఇదికాస్త విసుగు అనిపించినా సింహం మాత్రం తాబేలుని చూసీ చూడనట్టు వదిలేసింది. సింహాన్ని తిప్పలు పెట్టి తాబేలుపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తాబేలుకి టైం వచ్చిందంటూ స్పందిస్తున్నారు.