Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: ఒక్క రీల్ కోసం చేసిన ఆ ఒక్క జంప్.. ప్రాణాల మీదకు తెచ్చింది. కెమెరా ముందు కొన్ని సెకన్ల పాటు కనిపించే సాహసం.. జీవితాంతం మర్చిపోలేని గాయంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో 32 ఏళ్ల ఓ వ్యక్తి సోషల్ మీడియా రీల్ కోసం దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్‌లోకి దూకాడు. నీళ్లలో పడగానే సీన్ మారిపోయింది. రెండు కాళ్లు విరిగి, నీటిలో నుంచి బయటకు రావడం కూడా కష్టంగా మారింది.
ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ ప్రాంతానికి ఆదివారం సాయంత్రం పుష్పేంద్ర కుమార్ మనౌరియా తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడి వ్యూ పాయింట్ వద్ద ఉన్న భద్రతా రెయిలింగ్‌ను దాటి నీటిలోకి దూకాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు అతడి స్టంట్‌ను వీడియో తీస్తుండగా పుష్పేంద్ర రెయిలింగ్ ఎక్కాడు. ఆ సమయంలో వారిలో ఒకరు సరదాగా గాడ్ బ్లెస్ యువర్ సోల్ అంటూ కామెంట్ చేయడం కూడా వీడియోలో వినిపించింది. ఆ తర్వాత పుష్పేంద్ర దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకాడు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
అయితే అతడు ఊహించినట్లుగా లోతైన నీటిలో పడలేదు. నీటి అడుగున ఉన్న రాళ్లపై బలంగా పడటంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లను కదపలేని పరిస్థితిలో నీటిలోనే కొంతసేపు ఉండిపోయాడు. బయటకు రావడానికి ప్రయత్నించినా గాయాల కారణంగా నడవలేకపోయాడు. చివరకు చేతుల సాయంతో కదులుతూ అక్కడ కనిపించిన ఓ ఇనుప రాడ్‌ను పట్టుకున్నాడు. దాన్ని ఆసరాగా చేసుకుని ఒడ్డువైపు చేరేందుకు ప్రయత్నించాడు. అతడి స్నేహితులు, అక్కడున్న కొంతమంది వ్యక్తులు సహాయం చేయడంతో చివరకు అతడిని నీటిలో నుంచి బయటకు తీసుకురాగలిగారు.
ప్రమాదం గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పుష్పేంద్రను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కాళ్లకు అయిన గాయాల తీవ్రతను పరిశీలించిన వైద్యులు ఒక కాలికి శస్త్రచికిత్స చేసి రెండు రాడ్లు అమర్చారు. మరో కాలికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
తాను గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి స్టంట్లు చేశానని పుష్పేంద్ర చెప్పాడు. అందుకే ఈసారి కూడా తాను సులభంగా చేయగలనని భావించినట్లు తెలిపాడు. అయితే తాను దూకిన ప్రాంతంలో నీరు తక్కువ లోతులో ఉందన్న విషయం తనకు తెలియదని చెప్పాడు. అదే అతడి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది.
సోషల్ మీడియాలో కొన్ని సెకన్ల వీడియో కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేయడం ఇప్పుడు చాలామందికి సరదాగా మారుతోంది. కానీ కెమెరా ఆగిపోయిన తర్వాత ఎదురయ్యే పరిణామాలు మాత్రం రీల్లో కనిపించవు. అదృష్టవశాత్తూ పుష్పేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆ ఒక్క స్టంట్ ఎంత పెద్ద మూల్యం తీసుకురాగలదో అతడే స్వయంగా అనుభవించాడు. ఇకపై ఇలాంటి స్టంట్ ఎప్పటికీ చేయనని పుష్పేంద్ర చెప్పడం ఈ ఘటనలో మిగిలిన అతిపెద్ద పాఠం.
తాజావార్తలు
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!