స్వీట్ అంటే ఇష్టపడని వారెవరు.. పండగ అయినా, శుభకార్యం అయినా స్వీట్ లేకుండా పూర్తవదు. తీపి కబురు చెప్పడానికైనా, తీపి ముచ్చట్లు పెట్టుకోవడానికైనా స్వీట్ కంపల్సరీ. అయితే ఒక కేజీ స్వీట్స్ ఎంత ఉంటుంది.. రూ. 300.. పోనీ రూ. 500. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ, ఇక్కడం మనం చెప్పుకొనే మిఠాయి కేజీ రూ. 16 వేలు. ఏంటీ తమాషా చేస్తున్నారా..? ఒక్క కేజీ స్వీట్స్ అంత రేటు ఎందుకు అని కోపంగా చూడక్కర్లేదు. ఎందుకంటే…
స్వీట్ అంటేనే తీయగా ఉంటుంది. అయితే, ఈ స్వీట్ తీపితో పాటు కాస్తంత మధురానుభూతిని కూడా ఇస్తుంది. జస్ట్ టేస్ట్ చేస్తే చాలు… మొత్తం తినేయ్యాలనిపిస్తుంది. కానీ, అలా మొత్తం తినాలంటే చాలా డబ్బులు పెట్టాలి. ఈ స్వీట్ కిలో ధర జస్ట్ 16 వేల రూపాయలు మాత్రమే అంటున్నారు షాపు యాజమాన్యం. అంత ఖరీదు ఉండటానికి అందులో ఏమైనా బంగారం కలుపుతారా ఏంటి అంటే… అవుననే సమాధానం ఇస్తున్నారు స్వీట్ షాప్ సిబ్బంది. నోట్లో వేసుకుంటే…