ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సీక్వెల్ సినిమాలు పెద్దగా ఆడవు, ఫ్రాంచైజ్ లు ప్రేక్షకులకి మెప్పించే ప్రసక్తే లేదు అనే మాటలని చెరిపేసిన సీరీస్ ‘టైగర్ సీరీస్’. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన ఈ సిరీస్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరు. ‘ఎక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్ కన్నా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం టైగర్ సీరీస్ లో మూడో సినిమా సెట్స్ పై ఉంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ 2023 నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలని మించేలా తెరకెక్కుతున్న మూడో పార్ట్ లో సల్మాన్ అభిమానులకి ఒక సర్ప్రైజ్ ఉందనే టాక్ బాలీవుడ్ లో వినిపిస్తోంది.
‘టైగర్ 3’ సినిమాలో వెటరన్ హీరోయిన్ ‘రేవతి’ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట. చిత్ర యూనిట్ చాలా సెక్రెట్ గా దాచిన ఈ విషయం బీ-టౌన్ మీడియా పుణ్యమాని బయటకి వచ్చేసింది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రేవతి, సల్మాన్ ఖాన్ తో ‘లవ్’ అనే సినిమాలో నటించింది. తెలుగులో సూపర్ హిట్ అయిన వెంకటేష్ మూవీ ‘ప్రేమ’కి ‘లవ్’ రీమేక్ వెర్షన్. తెలుగు హిందీ రెండు భాషల్లో రేవతినే హీరోయిన్ గా నటించింది. ‘లవ్’ సినిమా రిలీజ్ అయ్యి ముప్పై ఏళ్లు దాటింది. ఈ గ్యాప్ లో రేవతి డైరెక్ట్ చేసిన ‘ఫిర్ మిలేంగే’ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ నటించాడు. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత రేవతి సల్మాన్ ఖాన్ లో కలిసి వర్క్ చేయడం ఇదే మొదటిసారి.