ఇద్దరు వ్యక్తులు బోట్ పై సుముద్రంలో షికారు వెళ్ళారు. సముద్రంలోకి ఫిషింగ్ చేద్దామనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం వల వేద్దామని ఫిక్స్ అయ్యారు. దానికోసం సముద్రంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చేపల గాలం వేస్తే.. చేపలు ఎక్కువగా పడతాయని గాలం విసిరారు. కొద్ది సేపటికి వల బరువుగా అనిపించింది. అమ్మయ్య బాగా ఎక్కువగానే చేపలు వలలో పడ్డాయని ఖుషీ అయ్యారు. కాస్త పైకి వల లాగారు ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది అంతే.. వారిద్దరి గుండెలు గుబేల్ మన్నాయి.
ఇక వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సమ్మర్ లో చేపల వేటకు వెళుతుంటారు. ఈ క్రామంలోనే ఇద్దరు వ్యక్తులు తమ బోట్ లో సముద్రంలోకి షిప్పింగ్ కు వెళ్లారు. చేపల కోసం గాలం వేస్తుండగా వాళ్లకు నీటి అడుగున ఓ నల్లటి ఆకారం కనిపించింది.. పొడవాటి షార్ప్ తోకతో చేపలా చకచకా ఈదుతూ ముందుకెళ్లోంది. ఏంటా అని చూడగా అది సొరచేప అని తెలిసి షాక్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది.