Bike Stunts in Malakpet:నగరంలో పోకిరీల ఆగడాలు.. బైక్ పై స్టంట్లు చేస్తూ ఇబ్బందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Stunts in Malakpet:ఎటువంటి సాధన చేయకుండా.. శిక్షణ తీసుకోకుండా .. అసలు కారణం లేకుండా చేసే విన్యాసాలతో కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు. బైక్ స్టంట్స్ చేయడం అనేది చిన్నపిల్లల ఆట కాదు.. స్టంట్స్ చేయడానికి సాధన అవసరమన్న సంగతి తెలిసిందే. అలా సాధన తీసుకుని చేసిన స్టంట్స్ ను ఎప్పుడైనా, ఎక్కడైనా దైర్యంగా ప్రదర్శించవచ్చు. అయితే ఎటువంటి సాధన చేయకుండా.. శిక్షణ తీసుకోకుండా .. అసలు కారణం లేకుండా చేసే విన్యాసాలతో కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడమే కాదు.. ఇతరులకు కూడా ఇబ్బందిని కలిగిస్తారు. కదులుతున్న బైక్ మీద విన్యాసాలు చేయడానికి ప్రయత్నించి.. హీరో అవుదామని జీరో అవుతుంటారు. బైక్ చేతిలో వుంటే చాలు.. బైక్‌పై నిలబడి నడపడం.. బైక్ స్పీడ్ పెంచి ఇతరులకు భయభ్రాంతులకు గురిచేయడం చేస్తుంటారు. బైక్ స్టంట్ చేసేప్పుడు కాస్త అజాగ్రత్తగా వున్నా సరే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అది తెలిసి కూడా ఉడుకురక్తం కదా సినిమా స్టైల్లో బైక్ స్టంట్ చేద్దామని ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు.. ఇతరుల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయని మరిచిపోతారు. వారు చేసే తప్పుకు మిగతావారుకూడా అనుభవించాల్సి వస్తుంది. ఇలా బైక్ స్టంట్ చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులు చేశారు మన నగరంలోని కుర్రాళ్లు..
Read also: Anil Kumar Yadav: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
హైదరాబాద్ లో ఇలాంటి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బైక్ పై స్టంట్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మలక్ పేట్, చంచల్ గూడ ప్రధాన రహదారిపై బైక్ లతో స్టంట్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నవారు ఎంఎస్ జూనియర్ కాలేజ్ విద్యార్దులుగా స్థానికులు చెబుతున్నారు. ఈ పోకిరిల స్టంట్స్ తో పలు ప్రమాదాలకు గురిఅవుతున్నట్లు వాపోతున్నారు. ఇటీవల పోకిరిల స్టంట్స్ పలువురు వాహనదారుదారులకు గాయాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పిన వినకుండా ఇంకా ఎక్కవ మోతాదులో సౌండ్ లు చేస్తూ తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాదరు. ఇలాంటి వారిపై అధికారులు స్పందించి వీరి ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. పోలీసులు వీరిపై నిఘాపెట్టాలని, ఇలా వెకిరి చేస్టలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Inspector leave letter: నాభార్య అలిగింది 10రోజులు లీవ్ కావాలి.. ఎస్ఐకి లెటర్ రాసిన ఇన్ స్పెక్టర్
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!