No Leave- Quits Job: అమెరికాలో జరిగే తన సోదరుడి పెళ్లికి కంపెనీ లీవ్ ఇవ్వకపోవడంతో ఓ ఉద్యోగం తన ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఈ విషయాన్ని ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్‌లో తెలిపాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, యూఎస్ లో జరిగే తన సోదరుడి వివాహానికి హాజరు అయ్యేందుకు.. మూడు వారాల ముందుగానే, 15 రోజుల సెలవు కావాలని కంపెనీలో తెలియజేశారు. కానీ, నా అభ్యర్థను సదరు కంపెనీ తోసిపుచ్చింది. ఇప్పుడు నేను పెళ్ళికి వెళ్లాలంటే.. ఉద్యోగానికి రాజీనామా చేయాలి.. నాలుగేళ్లు ఎంతో నిజాయితీగా పని చేసిన నన్ను.. ఆ సంస్థ అర్థం చేసుకోలేకపోయింది.. అందుకే ఇప్పుడు రిజైన్ చేశాను అని రాసుకొచ్చాడు.
Read Also: worlds-longest-train: ప్రపంచంలో అతిపొడవైన రైలు.. ఎక్కడుందో తెలుసా..
అయితే, నాలుగేళ్లు కంపెనీలో అంకితభావంతో.. తక్కువ జీతానికే విధులు నిర్వహించాను.. కానీ, కంపెనీ మాత్రం ఏమాత్రం నాకు సహకరించలేదు.. అందుకే వెళ్లిపోవాలని (రాజీనామా) ఫిక్స్ అయ్యాను.. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా.. అని రెడ్డిట్ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అయితే నేను రాజీనామా చేసినప్పటికీ.. నాపై పెద్దగా ఆర్ధిక భారం (అప్పు) పడదు అని పేర్కొన్నాడు. కాగా, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో రియాక్ట్ అవుతున్నారు. పని కంటే కుటుంబానికే ఎక్కువ విలువ ఇవ్వడం మంచి నిర్ణయం అని ఓ యూజర్ అంటే.. మరొ నెటిజన్ జీవితంలో దేన్నైనా రీప్లేస్ చేయొచ్చు, కుటుంబాన్ని రీప్లేస్ చేయలేమన్నారు.