Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
- మార్కులు తక్కువని తిట్టలేదు..
- కేక్ కోసి పండగ చేశారు
- వైరల్ అవుతున్న ‘55 శాతం’ మార్క్‌షీట్ సెలబ్రేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marksheet Cake: ముంబైకి చెందిన ఒక కుటుంబం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సాధారణ కుటుంబం లాగా కాకుండా ఈ ఫ్యామిలీ భిన్నంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి విద్యా వ్యవస్థలోని ఒత్తిడికి, మార్కుల వేటకు భిన్నంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ కుమారుడికి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా, ఆ అబ్బాయి సాధించిన విజయాన్ని ఆ కుటుంబం ఘనంగా వేడుక చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
మార్క్‌షీట్ కేక్‌తో సర్ప్రైజ్..
ముంబైకి చెందిన మహమ్మద్ జైద్ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో 55 శాతం మార్కులు సాధించాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు కోప్పడటం లేదా మిగతా వాళ్లతో పోల్చి తిట్టడం లాంటివి చూస్తుంటాం. కానీ జైద్ కుటుంబం మాత్రం అతని మార్క్షీట్నే ఒక కేక్‌గా తయారు చేయించి సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ కేక్‌పై జైద్ పేరు, రూల్ నంబర్, అతను ప్రతి సబ్జెక్టులో సాధించిన మార్కులను కూడా ముద్రించారు. జైద్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ అతనికి ఘనస్వాగతం పలికారు. తన మార్క్‌షీట్ థీమ్ కేక్‌ను చూసి ఆశ్చర్యపోయిన జైద్, చిరునవ్వుతో దానిని కట్ చేశాడు. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోను జైద్ సోదరి రుక్సర్ పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read
- Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే 'డెడ్లీ' లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
- TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
- Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
- Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
గొప్ప మనసు చాటుకున్న తల్లిదండ్రులు
ఈ వేడుకపై రుక్సర్ పటేల్ స్పందిస్తూ.. హృదయానికి హత్తుకునే మాటలు చెప్పారు. “నా దృష్టిలో మా తమ్ముడికి వచ్చిన 55 మార్కులు.. 95 మార్కుల కంటే ఎక్కువే. మార్కుల కోసం పిల్లలను తిట్టడం లేదా బాధపెట్టడం వల్ల వారు మానసికంగా కుంగిపోతారు. వాడు ఎప్పుడూ ఇతరుల కంటే తక్కువ అని భావించకూడదనే మేము ఇలా సెలబ్రేట్ చేశాం. ఒత్తిడి వల్ల పిల్లలను కోల్పోతున్న తల్లిదండ్రులను చూస్తుంటే బాధేస్తుంది, అందుకే మా ఇంట్లో సంతోషానికి ప్రాధాన్యత ఇచ్చాం” అని ఆమె రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “నేను 95 శాతం మార్కులు సాధించినా నాకు ఇలాంటి గౌరవం లభించలేదు.. ఈ కుటుంబం నిజంగా గ్రేట్” అని ఒకరు కామెంట్ చేయగా, “ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఉండాలి. పిల్లల మానసిక ఆరోగ్యం మార్కుల కంటే ముఖ్యం” అని మరొకరు రాసుకొచ్చారు. మార్కుల కంటే మనిషి ముఖ్యమని నిరూపించిన ఈ కుటుంబం, ఎంతో మంది తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచింది.
తాజావార్తలు
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్‌షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్‌తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?