Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Interview Tips: కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూలో చివర్లో అడిగిన ఒక్క ప్రశ్న కారణంగా తాను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఆయన చెప్పడంతో, ఉద్యోగార్థుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇంటర్వ్యూలో ఏమి జరిగింది?
కరణ్ గొగ్నా కెనడాలోని యూజ్డ్ కార్ల వ్యాపారానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. అన్ని ఇంటర్వ్యూ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు, హెచ్ఆర్ ఆయన డాక్యుమెంట్లు కూడా తీసుకుంది. దీంతో ఉద్యోగ ఆఫర్ దాదాపు ఖాయమైందని ఆయన భావించారు. అయితే ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు కంపెనీ సీఈవోతో ఒక చివరి సమావేశం ఉంటుందని హెచ్ఆర్ తెలిపింది. ఆ సమావేశం కూడా చాలా సానుకూలంగా సాగిందని కరణ్ వెల్లడించారు.
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
- 6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
- Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
- Hyderabad Green Tankers: గ్రీన్ ట్యాంకర్ల పేరుతో మురుగు నీటి సరఫరా కలకలం.. ఖాజాగూడలో ఏం జరుగుతోంది?
ఒక్క ప్రశ్నతో మారిన పరిస్థితి
ఇంటర్వ్యూ ముగిసే సమయంలో సీఈవో, “మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని అడిగారు. దీనికి కరణ్, “కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తోందా?” అని ప్రశ్నించారు. అయితే సీఈవో నేరుగా సమాధానం చెప్పకుండా, “మీ అభిప్రాయం ఏమిటి? మేము ఆ రంగంలోకి వెళ్లాలా?” అని తిరిగి ప్రశ్నించారు. నాలుగు చక్రాల వాహనాల మార్కెట్‌పై తాను పూర్తిగా సిద్ధమయ్యానని, కానీ టూ-వీలర్ విభాగంపై ఎలాంటి విశ్లేషణ చేయకపోవడంతో స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయానని కరణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
మరుసటి రోజే రిజెక్షన్
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిందని, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం ఇచ్చారని కరణ్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా, చివర్లో జరిగిన ఆ ప్రశ్నోత్తరాలే తన ఎంపికపై ప్రభావం చూపి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యోగార్థులకు కరణ్ ఇచ్చిన సలహా
ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు సమాధానాలు సిద్ధం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతారని, కానీ ఇంటర్వ్యూవర్ను ఏమి అడగాలి అనే విషయంలో అంతగా సిద్ధం కాదని కరణ్ పేర్కొన్నారు. “మీరు అడిగే చివరి ప్రశ్న కూడా మీ ఆలోచనా విధానాన్ని అంచనా వేసే అవకాశం కావచ్చు. అందుకే ప్రశ్న అడిగే ముందు దాని ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే ఆ ప్రశ్న మీకే తిరిగి వస్తే ఎలా సమాధానం చెప్పాలో కూడా ముందుగానే సిద్ధంగా ఉండాలి” అని ఆయన సూచించారు.
నెటిజన్ల స్పందన
కరణ్ పోస్టుకు వేలాది మంది స్పందించారు. కొందరు ఉద్యోగార్థులు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఉద్యోగం రాకపోవడానికి ప్రశ్న కారణం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, సీఈవో అసలు పరీక్షించింది ప్రశ్నను కాదని, అనూహ్య పరిస్థితుల్లో అభ్యర్థి ఎలా ఆలోచిస్తాడు, ఒత్తిడిలో ఎలా స్పందిస్తాడు అనే అంశాలను కావచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన ఉద్యోగ ఇంటర్వ్యూల్లో సమాధానాలతో పాటు సరైన ప్రశ్నలు అడగడం, వాటిపై అవగాహన కలిగి ఉండటం కూడా ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది.
తాజావార్తలు
-
Nvidia Windfall: అదృష్టమంటే ట్రంప్‌దే.. ఆ సీఈఓ రీ-ఎంట్రీతో ఏకంగా 1.4 బిలియన్ల లాభం!
-
Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
-
Dimple Hayathi: నా పెళ్లి ఎప్పుడైంది బాబూ? నెటిజన్ కామెంట్‌కు డింపుల్ హయాతి క్రేజీ రిప్లై!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు.. టీవీకే ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్..!
ట్రెండింగ్
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!