ఓ వైపు దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని గొప్పలు చెప్పుకుంటున్నా.. మరోవైపు, కొన్ని ఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నాం, వైద్యంలో మన పరిస్థితి ఏంటి? కనీస అవసరాల కల్పనలో మనం ఎక్కడున్నాం..? సాటివారిపట్ల మానవత్వం కూడా చూపించలేకపోతున్నామా? లాంటి విషయాలను తేటతెల్ల చేస్తుంటాయి.. తాజాగా, తన నాలుగేళ్ల కుమారుడి శవాన్ని ఓ తండ్రి.. తన భుజాలపైనే మోసుకుంటూ ఇంటికి చేరుకున్న దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు…