టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఒక పక్క ఆమె నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా మరోపక్క పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని జరుపుకొంటుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి యువరాణిగా కనిపిస్తోంది. ఇప్పటికే చేలా సార్లు పవన్ తో నటించడం గొప్ప వరమని చెప్పుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి పవన్ ని పోగొడ్తలతో ముంచెత్తింది. తాజాగా సోషల్ మీడియాలో ఆస్క్ మీ అంటూ అభిమానులతో చిట్ చాట్ సెషన్ పెట్టింది నిధి. ఇక ఇందులో వందలమంది పవన్ ఫ్యాన్స్ పవన్ మరియు హరి హర వీరమల్లు గురించిన ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు ఏ మాత్రం విసుక్కోకుండా నిధి అందరికి ఒక్క వర్డ్ తో జవాబు చెప్పేసింది.
” పవన్ తో నటించడం నా అదృష్టం.. ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ.. దేవుడు ఎంతో ప్రత్యేకంగా తయారుచేసిన వ్యక్తి పీకే సర్.. ఈ సినిమాలో నటించడం అద్భుతంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ‘హరిహరవీరమల్లు’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి ఈ హాట్ బ్యూటీకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందివ్వనుందో చూడాలి