తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచిన ఓ తండ్రి వారికి దూరం అయ్యాడు.. ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేసి.. ఆస్తి పాస్తులు కూడా పంచిన ఆ తండ్రి తమ మధ్య లేకపోవడం వారిని ఎంతో బాధించింది.. అయితే, ఆయన కుమారుడు మాత్రం.. చనిపోయిన తన తండ్రిని చెల్లి పెళ్లికి తీసుకురావాలనుకున్నాడు.. అచ్చం తన తండ్రిలాగే మైనంతో నాన్నను పునఃసృష్టించాడు.. సరాసరి పెళ్లి మండపానికే తన తండ్రిని తీసుకొచ్చాడు.. ఖరీదైన భారీ కళ్యాణమండపం.. ఎటూ చూసినా సందడి.. పెళ్లి కూతురు, పెళ్లికొడుకు రెడీగా ఉన్నారు.. కాసేపట్లో తాలికట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అప్పుడే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. వీల్ చైర్‌లో ప్రత్యక్షం అయ్యాడు ఆ తండ్రి.. అది బొమ్మే అయినా.. తమ తండ్రి రూపాన్ని ఒక్కసారిగా చూసి ఆ కుటుంబ సభ్యుల కళ్లు చెమ్మగిళ్లాయి.. భర్తను చూసి భార్య, పెళ్లి కూతురు.. ఒక్కరేంటి.. పెళ్లి మండపంలో ఉన్న అంతా భావోద్వేగానికి గురయ్యారు.. కన్నీళ్లు వరదై పారిపోయాయి.
Read Also: Rakesh Tikait: నాలుగు లక్షల ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయి.. అగ్నిపథ్ పై కీలక వ్యాఖ్యలు
చనిపోయిన నాన్న బతికి సజీవంగా వస్తున్నట్టు ఉన్న ఆ రూపాన్ని చూసి అంతా భావోద్వేగానికి లోనయ్యారు.. తమకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి ఆ కూతురి పెళ్లికి లేడు అనే లోటు లేకుండా చేశాడు పెళ్లి కూతురు అన్నయ్య.. ఇటీవలే తండ్రి కన్నుమూయడంతో ఆయన కుమారుడు, పెళ్లి కూతురు అన్ననే దగ్గరుండి ఆ పెళ్లిని ఘనంగా నిర్వహించాడు.. అన్నీ తానై ఏర్పాట్లు చేశాడు.. తీరా పెళ్లికి అందరూ సిద్ధం అయ్యేసరికి నాన్న ప్రతిరూపాన్ని తీసుకొచ్చి అందరి కళ్లల్లో ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని నింపాడు.. ముఖ్యంగా తన చెల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.. దీంతో అక్కడ వాతావరణం భావోద్వేగాలతో పాటు ఆనందంతో నిండిపోయింది.. బంధువులు, కుటుంబ సభ్యులంతా ఆ తండ్రి ప్రతిరూపంతో ఫొటోలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.. మొత్తంగా పెళ్లి తంతు పరిపూర్ణం అయ్యింది… ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. కొత్త జంటను ఆశీర్వదిస్తూనే.. ఆ కుమారుడు తన తండ్రిపై చాటిన ప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.