బిర్యానీ… దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కువగా ఇష్టపడే ఫుడ్. దేశంలో ప్రతి సెకనుకు ఐదు బిర్యానీ సేల్స్ అవుతున్నాయి. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. శాకాహారులకు, మాంసాహారులకు విడివిడిగా బిర్యానీలు ఉంటాయి. వంద రూపాయల నుంచి రెస్టారెంట్స్ లో బిర్యానీ దొరుకుతుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీ ఏంటి ? ధర ఎంత ఉంటుంది అంటే చెప్పడం కష్టం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ పేరు గోల్డెన్ బిర్యానీ. దీనిని దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న బొంబాయి బోరో అనే రెస్టారెంట్ తయారు చేసింది. స్వచ్ఛమైన 23 క్యారెట్ల బంగారంతో ఈ బిర్యానీని తయారు చేశారు. భారత దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఫేమస్ అయ్యిన నాలుగు రకాల బిర్యానీలను ఇక్కడ దొరుకుతాయి. ఒక్కో బిర్యానీ ఖరీదు 1000 దిన్హార్ లు మాత్రమే. మన కరెన్సీలో చూసుకుంటే రూ. 19 వేలకు పైగా ఉంటుంది. రుచి అద్భుతంగా ఉండటంతో ఈ బిర్యానీల కోసం దుబాయ్ ప్రజలు క్యూలు కడుతున్నారట.