Viral News: వాయమ్మా.. అక్కడ ఒక కండోమ్ ప్యాకెట్ రూ. 60 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఒక కండోమ్ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది? మన దేశంలో అయితే 30 రూపాయలకే లభ్యమవుతున్నాయి. కొన్ని దేశాల్లో అయితే స్వయంగా ప్రభుత్వాలే ఉచితంగా కండోమ్ ప్యాకెట్స్‌ని పంచి పెడుతున్నాయి. అవాంచిత గర్భధారణ నివారణకు, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులు వాపించకుండా ఉండేందుకే కండోమ్స్ వాడాల్సిందిగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయి. కానీ.. ఒక దేశంలో మాత్రం ఓ కండోమ్ ప్యాకెట్ ధర అక్షరాల రూ. 60 వేలు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇంతకీ ఏ దేశంలో అనుకుంటున్నారా? సౌత్ అమెరికాలోని వెనిజులాలో ఒక కండోమ్ ప్యాకెట్ అంత భారీ ధర పలుకుతోంది.
ఇందుకు కారణం.. వెనిజులాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే! ఈ సంక్షోభం కారణంగా ఆ దేశంలోని ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. ధరలన్నీ భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే కండోమ్ ప్యాకెట్ ధర ఏకంగా రూ. 60 వేలకు చేరింది. బ్రాండెడ్ టీవీలు ఇంత కంటే తక్కువ ధరకే అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ రేంజ్‌లో అక్కడ కండోమ్ ప్యాకెట్ల ధర పెరగడానికి మరో కారణం కూడా ఉంది. వెనిజులాలో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. ఎవరైనా అబార్షన్‌లకు పాల్పడితే, అక్కడ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే, అవాంచిత గర్భధారణను నివారించేందుకు అక్కడ కండోమ్ ప్యాకెట్ల వాటకం గణనీయంగా పెరిగిపోయింది. అంటే, వాటికి అక్కడ భారీ డిమాండ్ పెరిగింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు.. డిమాండ్ పీక్స్‌లో ఉండటం వల్ల వాటి ధరల్ని అమాంతం పెంచారు.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
2015 ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా టీనేజ్ గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటిగా నిలిచింది. పైగా, ఇక్కడ అబార్షన్‌పై నిషేధం ఉంది. అలాంటి దేశంలో ఒక కండోమ్ ప్యాకెట్‌పై రూ. 60 ధరలు కేటాయిస్తున్నప్పుడు, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎంత డిమాండ్, సంక్షోభం ఉంటే మాత్రం.. ధర మరీ అంత ఎక్కువగా పెంచేయాలా?
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!