ప్రపంచంలో మూడు వేలకు పైగా జాతుల పాములు కనిపిస్తాయి. వీటిలో కొన్ని పాములు చాలా విషపూరితమైనవి. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన 69 రకాల పాములు ఉన్నాయి. వీటిలో 40 భూమిపై నివసిస్తుండగా.. 29 సముద్రపు పాములు. భారతదేశంలో కనిపించే పాములలో కింగ్ కోబ్రా, క్రైట్ చాలా ప్రమాదకరమైనవి. ఈ విషసర్పాలు ఎవరినైనా కాటేస్తే మరణం సంభవించవచ్చు. ఈ ప్రమాదకరమైన పాములను చూసిన జానాలు భయాందోళనకు గురవుతుంటారు.
READ MORE: ENG vs PAK: మూడో టెస్టులో ఇంగ్లండ్ పై పాకిస్థాన్ విజయం.. సిరీస్ కైవసం
దిండులోంచి ప్రమాదకరమైన పాము బయటకు వస్తే.. మీ స్పందన ఎలా ఉంటుంది? అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో సోఫా కుషన్(దిండు)ను ఓ పెన్ చేయడం చూడొచ్చు. దిండు లోపల ఓ పెద్ద నాగుపాము కనిపించింది. ఓ స్నేక్ క్యాచర్ స్టిక్‌తో పామును కదిలించడంతో.. బుసలు కొడుతూ ఒక్కసారిగా బయటకు వచ్చింది. అతడిపై దాడి చేసేందుకు యత్నించింది. పాము చాలా పెద్దగా ఉంది. ఇంట్లో వాళ్లు దాన్ని గుర్తించకుండా కూర్చుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ముందుగా గుర్తించి మంచి పని చేశారు. ఈ వీడియో “అభిషేక్‌సంధు112” అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. లక్ష మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై ప్రజలు కూడా కామెంట్లు చేస్తున్నారు.
READ MORE:Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తిపై దాడి?(వీడియో)