ప్రముఖ యూట్యూబర్ చందుసాయి పరిస్థితి గురించి గత ఏడాది తెగ చక్కర్లు కొట్టింది.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ యువతిని చందు సాయి తన పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.. ఆ కేసు నుంచి మొత్తానికి బయటపడ్డాడు.. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
జైలుకి వెళ్లిన చందు సాయి.. దాదాపు నెల రోజులు పాటు జైలులో ఉండి, రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో కొనసాగుతుంది. ఇక బెయిల్ పై వచ్చిన చందు.. మళ్ళీ తన లైఫ్ ని రీ స్టార్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చందు చేసిన కామెంట్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి..
చందు మాట్లాడుతూ.. అత్యాచారాలు నేను ఎందుకు చేస్తాను. ఆ అమ్మాయి నేను కలిసి సహజీవనం చేసాము. ఆ రిలేషన్ ని కాపాడుకోవాలనే అనుకున్నాను. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు, విడిపోయాము. అయితే నేను అనుకోని విధంగా వాళ్ళు నా పై కేసు పెట్టారు.. జైల్లో ఉన్న మూడు రోజులు ఎంతగా ఏడ్చానో.. నా పరిస్థితి ఎందుకు ఇలా మారిందని కుమిలి పోయాను.. కేసు కోర్టులో ఉంది.. అస్సలు నిజాలు అప్పుడే తెలుస్తాయి.. కానీ అబ్బాయిలు లివింగ్ రిలేషన్ అసలు పెట్టుకోవద్దు.. అబ్బాయిదే తప్పు అంటారు.. సో జాగ్రత్త అని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది..