అసలే వర్షాకాలం.. ఒకవైపు వాన పడుతుంటే.. మిర్చి బజ్జియో, బాగా కాల్చిన జొన్నపొత్తు తింటే ఆ మజాయే వేరుగా వుంటుంది. ఈ టేస్ట్ సామాన్యుడికైనా, మంత్రికైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా ఒకేలా వుంటుంది. అయితే, అధికారంలో వున్నవారు రోడ్డుపక్కన ఆగి మొక్కజొన్న పొత్తులు దగ్గరుండి కాల్చిన తర్వాత తినడం అంత సాధ్యంకాదు. కానీ బీజేపీ ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్టే (Faggan Singh Kulaste) రోడ్డు వెంట వెళుతూ ఒక చోట ఆగారు. అక్కడ చిన్న గుడిసెలో జొన్నకండెలు కాలుస్తూ ఒక చిరువ్యాపారి కన్పించాడు.
అంతే ఎంపీ ఫగ్గన్ సింగ్ కులస్టే రోడ్డుపక్కన కారాపి అతని దగ్గరికి దిగిపోయారు. వెంటనే ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లి జొన్నపొత్తులు కావాలని కోరారు. బొగ్గుల మీద కాల్చిన ఆ జొన్న కండెలకు నిమ్మరసం రాయమని కోరారు ఎంపీ. ఆ వ్యాపారి అలాగే చేశాడు. కానీ ఆ జొన్నకండెలు తాను చెప్పిన రేటుకి ఇస్తావా అని అడిగారు ఎంపీ. ఇంతకీ వ్యాపారి మూడు జొన్నపొత్తులు కలిపి ఎంపీని అడిగింది రూ.45 ఎంపీ మాత్రం ఇంకా తక్కువకు ఇస్తావా అని అడిగారు. కానీ వ్యాపారి మాత్రం ఇక్కడ బేరాల్లేవమ్మా అన్నట్టుగా ఎంపీతో ఖరాఖండీగా చెప్పేయడం వినిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
వర్షకాలంలో జొన్న పొత్తులు కాల్చి ఇవ్వడం కాస్త కష్టమే. బొగ్గుల మీద కాల్చిన జొన్న పొత్తులు చాలా రుచిగా వుంటాయి. ఎంత సంపన్నులైనా ఈ రుచికి ఫిదా కావడం కామన్. అయితే ఎంపీగా వుండి జొన్న పొత్తులు బేరమాడడం చర్చనీయాంశంగా మారింది. మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను..లో ఇక్కడ బేరాల్లేవమ్మా డైలాగ్ ఇక్కడ గుర్తుచేసుకోవాలి. పైగా ఎంపీ, చుట్టూ బోల్డంత మంది బాడీగార్డులు వున్నా.. ఆ వ్యాపారి మాత్రం బేరాల్లేవమ్మా అంటూ ఎంపీకి షాకివ్వడం వైరల్ అవుతోంది.
Viral Video: కాదేది బట్టలారేయడానికి అనర్హం.. అన్నట్లుంది..