బీహార్ రాష్ట్రం మోతీహరి జిల్లాలోని హర్సిద్ధి మార్కెట్లో కొత్తగా పెళ్లైన ఒక టీచర్ టవర్‌పై నుంచి దూకుతానని బెదిరించింది. ఆ మహిళ తన అత్తమామల ఇంటికి వెళ్లనని గట్టిగా అరుస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రాంతంలోని జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఈ హై వోల్టేజ్ డ్రామా గంటల తరబడి కొనసాగింది.
READ MORE: Alcohol Effects on Sleep: షాకింగ్ నిజాలు.. మద్యం తాగి నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా?
స్థానికులు సమాచారం ప్రకారం.. ఆ మహిళకు ఒక సంవత్సరం క్రితం హిందూ ఆచారాల ప్రకారం చాలా వైభవంగా వివాహం జరిగింది. ఏ వధువు అయినా వివాహం అనంతరం మెట్టినింటికి వెళ్లా్ల్సిందే కదా.. ఈ టీచర్‌కి కూడా ఆ రోజు రానే వచ్చింది. కానీ.. వివాహం జరిగినప్పటి నుంచి ఆమె తన తల్లి ఇంట్లో నివసిస్తూ తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తోంది. కుటుంబం, సమాజం నుంచి ఒత్తిడికి పెరిగింది. అత్తమామల ఇంటికి వెళ్లాల్సిందే అంటూ శనివారం పట్టుబట్టడంతో అకస్మాత్తుగా టవర్ ఎక్కి గొడవ చేయడం ప్రారంభించింది.
టవర్ ఎక్కిన ఆ మహిళ అక్కడి నుంచి దూకుతానని పదే పదే బెదిరించింది. జనంలో భయాందోళనలను రేకెత్తించింది. ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హర్సిద్ధి పోలీస్ స్టేషన్‌కి చెందిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళను ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. చివరికి, ఆమెకు న్యాయం, భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ నుంచి కిందకు దిగింది. పోలీసులు ఆ మహిళను తమ అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు.
"मैं ससुराल नहीं जाऊंगी…" कहकर महिला टावर पर चढ़ गई। घंटों हाई वोल्टेज ड्रामा चला, परिवार वाले हाथ जोड़ते रहे। घटना मोतिहारी के हरसिद्धि बाजार की है। #Motihari #HighVoltageDrama #WomanOnTower #Bihar #ViralNews pic.twitter.com/br4aJFAORM
— FirstBiharJharkhand (@firstbiharnews) September 6, 2025