Dwarf Couple: అర్థరాత్రి వీళ్లు చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనోబలం ఉంటే దేన్నైనా ఎదురించొచ్చన్న నానుడిని ఓ మరుగుజ్జు జంట నిరూపించింది. తాము పొట్టిగా ఉన్నంతమాత్రాన చేతకానివాళ్లం కాదని, తమని తక్కువ అంచనా వేయొద్దని చాటిచెప్పారు. తమ ఇంట్లోకి చొరబడిన దొంగను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా, పారిపోకుండా కట్టిపడేశారు. ఈ ఘటన బీహార్‌లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బక్సర్ జిల్లాలోని కృష్ణబ్రహ్మం పోలీస్ స్టేషన్ పరిధిలోని నువాన్ గ్రామంలో రంజిత్ పాశ్వాన్, సునైనా అనే మరుగుజ్జు దంపతులు నివసిస్తున్నారు. ఇటీవల అర్థరాత్రి సమయంలో వీరి ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించాడు. అల్మారా తెరిచి సామాన్లు తీస్తుండగా.. శబ్దం వినిపించింది. దీంతో తమ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడన్న విషయాన్ని గ్రహించిన ఆ దంపతులు.. భయపడకుండా ధైర్యం ప్రదర్శించారు. అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. దొంగకు అనుమానం రాకుండా పట్టుకునేందుకు ఓ పక్కా ప్లాన్ వేసుకున్నారు.
Also Read
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ప్లాన్ ప్రకారం.. దంపతులిద్దరు ధైర్యం కూడగట్టుకొని, ఆ దొంగపై ఎగబడ్డారు. ఆ దొంగ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. వాళ్లు పారిపోనివ్వలేదు. అతనికి తమదైన శైలిలో తగిన బుద్ధి చెప్పి, చివరికి పారిపోకుండా పోల్‌కు కట్టేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత స్థానిక ప్రజలు ఆ మరుగుజ్జు దంపతుల సాహసాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!