కరోనా కాలంలో ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చేసే పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న వేళ నిబంధనలు పాటిస్తూ గతంలో వివాహాలు జరిగాయి. కొన్ని చోట్ల వర్చువల్‌గా వివాహాలు జరిగాయి. కరోనా తగ్గుముఖం పడుతున్నా జన సమూహానికి తావులేకుండా పరిమిత సంఖ్యలోనే వివాహాలకు అనుమతి ఇస్తున్నారు. కొంతమంది పెళ్లి విషయంలో మరింత వెరైటీగా ఆలోచించి పెళ్లి శుభలేఖల మొదలు అన్నీ కొత్తగా ఆలోచిస్తున్నారు.
Read: ఈ పర్వతాన్ని అధిరోహించాలంటే… ప్రాణాలమీద ఆశ వదిలేసుకోవాల్సిందే…
ఇందులో భాగంగానే త్వరలోనే వివాహం చేసుకోబోతున్న యశ్‌పూర్ జిల్లా, పర్‌సభ సమితి, అంకిరా గ్రామానికి చెందని లోహిత్ సింఘ్ లు మరింత వినూత్నంగా ఆలోచించారు. ఆధార్ తరహాలో పెళ్లి కార్డ్‌ను వేయించి బంధువులు, స్నేహితులకు పంచారు. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని పెళ్లి శుభలేఖలో పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఉన్నవిధంగానే శుభలేఖలో బార్ కోడ్ ఉన్నది. ఈ బార్ కోడ్‌ను స్కాన్ చేస్తే పెళ్లి సమయం, పెళ్లి వివరాలు, పెళ్లి సమయంలో పాటించాల్సిన నిబంధనలు అన్ని వివరంగా అందులో చూపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డ్ తరహా వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.