Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey Massage: సాధారణంగా సెలూన్ షాపులకు మనుషులు వెళ్లి హెయిర్ కట్, హెడ్ మసాజ్ చేయించుకోవడం రోజూ చూసే విషయమే. కానీ ఓ వానరం నేరుగా సెలూన్‌లోకి అడుగుపెట్టి, కస్టమర్ తరహాలో కుర్చీలో కూర్చుని వీఐపీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వింతైన, ఫన్నీ ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. రోజంతా ఆహారం కోసం అటూ ఇటూ తిరిగి అలసటకు గురైందో ఏమో తెలియదు గానీ, ఓ కోతి దర్జాగా ఓ బార్బర్ షాపులోకి రాయల్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడున్న ఖాళీ కుర్చీని చూసి ఎలాంటి తటపటాయింపు లేకుండా ఠీవిగా అందులో కూర్చుండిపోయింది. అక్కడ ఉన్న బార్బర్ కూడా ఆ కోతిని చూసి భయపడకుండా, బయటకు వెళ్లగొట్టకుండా, ఓ సాధారణ కస్టమర్‌కు చేసినట్లే దానికి హెడ్ మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు.
బార్బర్ చేతి మసాజ్ తగలగానే ఆ వానరానికి ఎక్కడలేని హాయి దొరికినట్లయింది. గాల్లో తేలిపోతున్న అనుభూతితో, కళ్లు రెండూ మూసుకుని పరవశించిపోతూ అత్యంత రిలాక్స్డ్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఏమాత్రం కదలకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అది మసాజ్ చేయించుకున్న తీరు అక్కడున్న వారిని, ఆ దృశ్యాలను చూసిన వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన, ఫన్నీ వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఎప్పుడూ సరదా పోస్టులతో నెటిజన్లను అలరించే ఆయన, ఈ వీడియోకు “మంకేశ్ భాయ్ మసాజ్ ఎంజాయ్ చేస్తున్నారు.. దయచేసి ఎవరూ డిస్టర్బ్ చేయకండి” అంటూ అదిరిపోయే క్యాప్షన్ జోడించారు. మంత్రి పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. “వానరానికీ రోజువారీ టెన్షన్లు ఎక్కువయ్యాయేమో”, “మంకేశ్ భాయ్ వీఐపీ సర్వీస్ సూపర్” అంటూ నెటిజన్లు సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
Monkesh bhai is enjoying his massage time.
Do Not Disturb. pic.twitter.com/sbRzSOsnCP
— Temjen Imna Along (@AlongImna) September 20, 2026
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..