ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత సీజన్ లో ఈ రెండు జట్లు తలపడిన రెండు మ్యాచ్ లలో పంజాబ్ భారీ విజయం సాధించింది. కానీ ఈ సీజన్ లో మాత్రం బెంగళూరు జట్టు మంచి ఫామ్ లో ఉంది. వరుసగా విజయాలు నమోదు చేస్తుంది. అయితే ఈసారి బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగంలో చాలా బలంగా కనిపిస్తుంది. కానీ పంజాబ్ మాత్రం అందులో తడబడుతుంది. అయితే బెంగళూరు ఈ ఐపీఎల్ లో ఆడిన 6 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 3 వ స్థానంలో నిలిచింది. కానీ పంజాబ్ మాత్రం 6 మ్యాచ్ లలో 4 ఓడిపోయింది. దాంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంది. ఇందులో పంజాబ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ బెంగళూరు విజయం సాధిస్తే మొదటి స్థానానికి వెళ్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.