18 ఏళ్ల వయస్సు నుంచి 45 ఏళ్ల వయస్సు మధ్య సుమారు 59 కోట్ల మంది ప్రజలున్నారు. “వ్యాక్సిన్” వేయుంచుకోవాలంటే, 59 కోట్ల మందిలో పేదలు, నిరుపేదలకు డబ్బు ఎక్కడిది..!? అని సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. వ్యాక్సిన్ ధర కూడా చాలా అసాధారణ అంశం. ప్రభుత్వం ప్రయివేట్ రంగం విధానం లాగా ఈ అంశంలో ప్రవర్తించరాదు. భారత దేశం స్వాతంత్య్రం సాధించినవ్పటి నుంచి అనుసరిస్తూ వచ్చిన “ జాతీయ రోగనిరోధక విధానం” నే పాటించాలి. ఒక్కో డోసు 150 రూపాయలకే కొనుగోలు చేస్తున్నట్లు గత వారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. కాబట్టి కేంద్రం వ్సాక్సిన్ ను సేకరించి రాష్ట్రాలకు గతంలో లాగానే ఉచితంగా సరఫరా చేయాలి. అని అన్నారు.