ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. శిఖర్ ధావన్ (28) పరుగులు చేయగా పృథ్వీ షా(53) అర్ధశతకంతో రాణించాడు. అయితే వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత స్మిత్(34), రిషబ్ పంత్ (37) ముడో వికెట్ కు 58 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పారు. రిషబ్ ఔట్ అయిన స్మిత్ హిట్టింగ్ చేస్తూ చివరి వరకు నాట్ ఔట్ గా నిలవడంతో ఢిల్లీ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు, రషీద్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే హైదరాబాద్ 160 పరుగులు చేయాలి. అయితే ఈ లక్ష్యం చేధించదగినదే అయిన సన్‌రైజర్స్ కు మాత్రం ఈ టార్గెట్ ఛేదించడం కష్టం. చూడాలి మరి ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ రైజ్ అవుతారా.. లేదా అనేది.