ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రెస్ మీట్లు.. ఇంకోపక్క ఇంటర్వ్యూ లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ త్రయం పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బిజీ షెడ్యూల్ లోనూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్ ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ” ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని, రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు. బాహుబలి టీమ్ తో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు” రాజమౌళి.
ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ ” ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని, ఈ భూమిపై మనం అందరం అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలని” కోరారు. తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని, ట్రిపుల్ ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందని హీరో రామ్ చరణ్ అన్నారు. ఇక మూవీ రిలీజ్ షెడ్యూల్ లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఎంపీ సంతోష్ కుమార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
Oh come on! That’s sweet and awesome articulation in Hindi @tarak9999 garu. Thank you for your kind words for our #GreenIndiaChallenge. Participation of your fanfare would immensely help in increasing the green cover in not only our state but in the country too.@RRRMovie pic.twitter.com/984nzkNDVt
— Santosh Kumar J (@MPsantoshtrs) March 23, 2022
Team #GreenIndiaChallenge extends it’s heartfelt thanks and wish for the mega grand success of @tarak9999 @AlwaysRamCharan upcoming historical movie @RRRMovie. The colossal combo of these two young heroes might have excelled in their roles in the direction of mighty @ssrajamouli. pic.twitter.com/S977Qa8qQT
— Santosh Kumar J (@MPsantoshtrs) March 23, 2022