Astrology: మార్చి 22, మంగళవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారికి మీ లక్ష్య సాధనలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. విద్యార్థులకు అతి ఉత్సాహం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థినుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది.
Also Read
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ స్తోమతకు మించి వాగ్దానాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యములో మెళుకువ అవసరం. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. తెలివి తేటలతో వ్యవహారించడంవల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు జాగ్రత్త వహించండి. ఏ పని మొదలు పెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. దంపతుల మధ్య అరమరికలు లేకుండా మెలగవలసి ఉంటుంది. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
కన్య : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకున్నా నెమ్మదిగా సమసిపోతాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు లాభసాటిగా ఉంటాయి.
తుల : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు వారి సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. స్త్రీలకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధన వ్యయం అధికమైనా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తుల తొందరపాటు తనం వల్ల అధికారులతో మాటపడక తప్పదు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హజరుకావడం మంచిది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల జాగ్రత్త అవసరం.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. రుణ దాతలను మంచి మాటలతో సంతృప్తి పరచడం శ్రేయస్కరం. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కీలకమైన విషయాలు మీరే సమీక్షించుకోవటం మంచిది. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలుసుకుంటారు నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి.
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!