Onion Prices: సామాన్యుడి కంట కన్నీరు.. భగ్గుమంటున్న ఉల్లి ధరలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Prices: తెలంగాణలో గత కొంతకాలంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఉల్లి ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. గత నెలన్నర రోజులుగా మార్కెట్లో ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఒకప్పుడు కిలోల కొద్దీ కొనుగోలు చేసిన వినియోగదారులు, ప్రస్తుతం కేవలం అత్యవసరానికి సరిపడా మాత్రమే కొంటూ సరిపెట్టుకుంటున్నారు.
ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి నాణ్యతను బట్టి కిలో ₹25 నుంచి ₹50 వరకు పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్లకు వచ్చేసరికి ఆ ధర ₹60 నుంచి ₹80 వరకు చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో నాణ్యమైన ఉల్లిని వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలంగాణలో ఉల్లి వినియోగం అధికంగా ఉన్నప్పటికీ, స్థానిక ఉత్పత్తి అవసరాలకు సరిపడా ఉండదు. ప్రధానంగా మహారాష్ట్రలోని నాసిక్, లాసల్గావ్, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి వచ్చే సరుకుపైనే రాష్ట్ర మార్కెట్లు ఆధారపడుతున్నాయి. గత రెండేళ్లుగా సరైన ధరలు లేకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించడమే కాకుండా.. ఇటీవల ఆయా రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడం, పంట కోతలు ఆలస్యం కావడం, రవాణా అడ్డంకులు ఎదురవడంతో తెలంగాణకు రావాల్సిన సరుకు గణనీయంగా తగ్గింది. ఫలితంగా డిమాండ్‌కు తగిన సరఫరా లేక వ్యాపారుల వద్ద నిల్వలు అడుగంటి ధరలు పెరిగాయి.
Also Read
- Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
- Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్‌కు ముంబై పగ్గాలు..!
- AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
- White House Lockdown: ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్డౌన్
ధరల పెరుగుదల వెనుక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాత లోటు, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడటం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఉల్లి పంటకు మొలకెత్తే దశ నుంచి గడ్డ పరిమాణం పెరిగే వరకు సరైన తేమ, నీటి సరఫరా అవసరం. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా లేదా అతివృష్టి సంభవించినా పంట తీవ్రంగా దెబ్బతింటుంది. మహారాష్ట్ర వంటి ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాలలో వాతావరణం అనుకూలించకపోవడం దేశవ్యాప్త సరఫరాపై ఒత్తిడి పెంచింది.
రాబోయే రోజుల్లో ధరలు దిగివస్తాయా లేదా మరింత పెరుగుతాయా అనేది ప్రధానంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే కొత్త పంట రాకపైనే ఆధారపడి ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొత్త ఉల్లి మార్కెట్లకు భారీగా వస్తే తప్ప ధరలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ప్రతికూల వాతావరణం వల్ల కోతలు మరింత ఆలస్యమైతే లేదా దిగుబడి తగ్గితే, ఈ అధిక ధరలు మరికొంత కాలం కొనసాగే ప్రమాదం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Onion Prices: సామాన్యుడి కంట కన్నీరు.. భగ్గుమంటున్న ఉల్లి ధరలు..!
-
Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
-
Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్‌కు ముంబై పగ్గాలు..!
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
ట్రెండింగ్
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?