IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kris Srikkanth About Suryansh Shedge: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్‌పై ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్ ట్రేడ్ ద్వారా తీసుకుందనే ప్రచారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రేడ్‌లో భాగంగా పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబైకి పంపించనున్నట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ భారీ ట్రేడ్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు.
హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అయితే యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేపై మాత్రం విమర్శలు చేశాడు. అతడి బౌలింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు అతడికి భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ‘ఈ ట్రేడ్ వల్ల ముంబై కంటే పంజాబ్‌కే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. హార్దిక్ వస్తే పంజాబ్ జట్టులో ఆల్‌రౌండర్ల సంఖ్య పెరుగుతుంది. అయితే సూర్యాంశ్ షెడ్గేను మాత్రం నేను ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను. సూర్యాంశ్ భారత జట్టుకు కూడా ఆడినప్పటికీ.. అసలు అతడికి టీమిండియాలో ఎలా అవకాశం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను హార్దిక్ రాక పంజాబ్‌కు పెద్ద ప్లస్ అవుతుంది’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నారు. సూర్యాంశ్ టీమిండియా తరఫున 3 టీ20లు ఆడి 8 రన్స్ చేశాడు
Also Read
- Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్‌కు ముంబై పగ్గాలు..!
- AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
- India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
- IPL 2027-CSK: అక్షర్ పటేల్ కోసం ఆ స్టార్‌ను వదులుకోవద్దు.. సీఎస్కే భారీ మూల్యం చెల్లించక తప్పదు!
‘ముంబై ఇండియన్స్‌కు కూడా అర్ష్‌దీప్ సింగ్ చేరికతో ప్రయోజనం ఉంటుంది. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో అర్ష్‌దీప్ వంటి పేసర్ రావడం జట్టుకు ఉపయోగపడుతుండి. ముంబై ప్లేయర్స్ ఇక సమష్టిగా ఆడే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ మళ్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అన్ని సెట్ అవుతాయి అనుకుంటున్నా.పాండ్యాకు పంజాబ్ కెప్టెన్సీ దక్కే అవకాశమే లేదు. శ్రేయస్ అయ్యర్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తారు. శ్రేయస్‌ను కెప్టెన్సీ కోసమే రికీ పాంటింగ్ జట్టులోకి తీసుకున్నాడు. హార్దిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే జట్టులో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్‌లో గతంలో ఎదురైన పరిస్థితులు పునరావృతం కావచ్చు’ అని శ్రీకాంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇక పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను వదులుకుని.. వేలంలో మరో పేసర్‌ను తీసుకునే అవకాశం ఉందని క్రిస్ శ్రీకాంత్ అంచనా వేశారు. మిడిల్ ఓవర్లలో భారీ షాట్లు ఆడగల బ్యాటర్ అవసరం పంజాబ్‌కు ఉందని, సూర్యాంశ్ షెడ్గే స్థానంలో హార్దిక్ వస్తే ఆ లోటు భర్తీ అవుతుందని పేర్కొన్నారు. అర్ష్‌దీప్ ముంబై ఇండియన్స్‌లోకి వస్తే.. దీపక్ చహర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని శ్రీకాంత్ సూచించారు. హార్దిక్ –అర్ష్‌దీప్ ట్రేడ్ జరిగితే పంజాబ్, ముంబై జట్ల కూర్పులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ట్రేడ్‌పై ఫ్రాంచైజీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్‌కు ముంబై పగ్గాలు..!
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
White House Lockdown: ట్రంప్ వైట్‌హౌస్‌లో ఉండగానే కలకలం.. తాత్కాలిక లాక్డౌన్
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
ట్రెండింగ్
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!