కరోనా మహమ్మారికి ప్రజల జీవితాలు ఆసుపత్రుల పాలవుతుంటే , కొంత మంది ఆసుపత్రిలో పని చేసే సిబ్బంది మాత్రమే ఇదే అదనుగా భావించి కరోనా సోకినా వ్యక్తికి అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు. కరీంనగర్ లో కరోనా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే రోగులకు అందించే రెమెడీసీవర్ ఇంజెక్షన్లను ఆసుపత్రులలో పని చేసే కొంత మంది సిబ్బంది స్వలాభం కోసం రెమెడీసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో వీరి యొక్క కదలికల పైన నిఘా ఉంచిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లు సైదాపూర్ మండలానికి చెందిన లావుడ్య అంజనీ కుమార్,క్రొత్తపల్లి మండలానికి చెందిన చోపరి గోపిచంద్, చొప్పదండి మండలానికి చెందిన గజ్జెల శ్యామ్ కుమార్ మరియు కరీంనగర్ లోని సావ్రన్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన గంటల యుగంధర్ లు వీరు నలుగురు కరీంనగర్ లోని ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్ ,అనేస్తేషియా టెక్నీషియన్ ,రిసెప్సనిస్ట్ మరియు డ్రైవర్ లుగా పని చేస్తూ రెమెడీసీవర్ ఇంజెక్షన్లను తమ యొక్క ఆసుపత్రిలో ఎవరైనా పేషెంట్ కు అవసరమైనపుడు వీరు ఒకరినొకరు తాము బ్లాక్ చేసి పెట్టుకున్న ఇంజెక్షన్లను అధిక ధరలకు పేషెంట్లకు అందిస్తున్నారన్న సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు కిసాన్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రవిష్టా అపార్ట్మెంట్ వద్ద ఇంజెక్షన్లను క్రయ విక్రయాలు చేస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది .వీరి వద్ద నుండి ఏడు రెమెడీసీవర్ ఇంజెక్షన్లను, నాలుగువేల ఐదు వందల ముపై రూపాయల నగదు మరియు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది .