ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరు జట్టులో ఓపెనర్లు ఇద్దరు విరాట్ కోహ్లీ (12), దేవదత్ (17) వరుస ఓవర్లలో పెకిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వారిలో రజత్ పాటిదార్(31), గ్లెన్ మాక్స్వెల్(25) పర్వాలేదు అనిపించిన ఎబి డివిలియర్స్(75) చివరి వరకు ఔట్ కాకుండా హిట్టింగ్ చేయడంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది కోహ్లీసేన. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, కగిసో రబాడా, ఇశాంత్ శర్మ, అవేష్ ఖాన్ అందరూ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే క్యాపిటల్స్ 20 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చూడాలి మరి ఢిల్లీ బ్యాట్స్మెన్స్ ఏం చేస్తారు అనేది.