ఏపీ పశ్చిమ గోదావరిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. దీని పై ఏలూరు సబ్ డివిజన్ డి.ఎస్.పి దిలీప్ కిరణ్ మాట్లాడుతూ… క్రికెట్ బెట్టింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసాము అని తెలిపారు. వారి వద్ద నుండి 20వేల నగదు ఒక టీవీ 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాము. మరో ఏడుగురు పంటర్లు ఉన్నట్లు గుర్తించాం. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో నిన్న 7 కేసులు నమోదు చేసి ఏడుగురు బుకీలను అరెస్టు చేశాం అని చెప్పిన ఆయన… గాంబ్లింగ్ కు యువత దూరంగా ఉండాలి.. కష్టపడి సంపాదించిన సొమ్ము నాశనం చేసుకోకండి అని తెలిపారు.