సింగర్ మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది.. ఎప్పుడు పద్దతిగా కనిపించే మంగ్లీ ఇప్పుడు తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో ఆమెను అలా చూసిన వారంతా షాక్ అవుతున్నారు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయ్యారు. మంగ్లీ హీరోయిన్ గా స్వేఛ్చ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ ను అందుకుంటుంది.. గత నాలుగేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా సాంగ్స్ విపరీతమైన ఆదరణ పొందాయి.. ఆమె తో పాడించిన పాటలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. దాంతో సినీ దర్శకులు ఆమెతో పాట పాడించాలని డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు..
సింగర్ మంగ్లీ పాటకు మూడు లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఆమెకు అంత డిమాండ్ ఉంది. తన సంపాదనతో సొంత ఊరిలో దేవాలయం కట్టించిందట. సామాజిక సేవకు కూడా మంగ్లీ డబ్బులు ఖర్చు చేస్తారని సమాచారం. మంగ్లీ సింగర్ గా అభిమానులను సంపాదించుకుంది.. స్టార్ సింగర్ మంగ్లీ తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది.. మంగ్లీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది..