శంకర్ పల్లిలో అల్లు అర్జున్ ఆస్తి కొనుగోలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శంకర్ పల్లిలో సందడి చేశారు. ఆయన అక్కడ ఆస్తి కొన్నట్లుగా తెలుస్తోంది. ఆయన అక్కడి అధికారులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే… శుక్రవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం తాసిల్దార్ కార్యాలయంలో అల్లు అర్జున్ కంపించడంతో సందడి నెలకొంది. అల్లు అర్జున జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేయగా, రిజిస్ట్రేషన్ కొరకు శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ అనంతరం తాసిల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. ఆయన అక్కడికి వచ్చారని తెలుసుకున్న అభిమానులు భారీగా గుమిగూడారు. అల్లు అర్జున్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తాసిల్దార్ కార్యాలయం అధికారులు సైతం బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇటీవల తారక్ కూడా గోపాలపురంలో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు.

Read Also : “కొండపొలం” ఫస్ట్ రివ్యూ

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం “పుష్ప ది రైజ్ పార్ట్ 1″గా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

-Advertisement-శంకర్ పల్లిలో అల్లు అర్జున్ ఆస్తి కొనుగోలు

Related Articles

Latest Articles