టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.. ప్రస్తుతం సినిమాల్లేక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. అవి ట్రెండ్ అవుతుంటాయి.. అంతేకాదు ఈ మధ్య సినిమాల్లేక ప్రేమలో మునిగి తేలుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మొన్నీమధ్య తన బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికింది.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ప్రియుడితో రొమాన్స్‌లో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి…
తాజాగా పూజా బాయ్ ఫ్రెండ్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది.. అతనేవరో కాదు.. హిందీ బిగ్ బాస్ 10 ఫేమ్ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మధ్య పూజా ఎక్కడ కనిపించినా కూడా అతను కూడా ఆమె వెంట ఉంటున్నాడు.. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది..
ఇదిలా ఉండగా నిన్న పూజా తన ఫ్యామిలీ తో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది.. ఆ ఫ్యామిలీతో రోహన్ కూడా కనిపించాడు.. ఫొటోలకు పోజులిచ్చాడు.. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే పూజా హెగ్డే నోరు విప్పేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సినిమాల విషయానికొస్తే.. పూజా చివరగా ఆచార్య సినిమాలో కనిపించింది.. ఆ తర్వాత సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు..