ఇప్పటి వరకు మనం డ్రోన్ కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చూసి ఉంటారు. పారాచూట్లో వెళ్తూ షూటింగ్ చేయడం చూసుంటారు. కాని, చిలుక ఎగురుతూ వీడియో తీయడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. చిలుక మాట్లాడుతుందని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓ వ్యక్తి తన మొబైల్‌ను చూసుకుంటుండగా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు పోయింది. అయితే ముక్కుకు ఫోన్‌ను కరుచుకుపోవడంతో వీడియో మోడ్ ఆన్ అయింది. అంతే చిలుక ఆకాశంలో ఎగురుతున్నంత సేపు ఆ మొబైల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇళ్లమీద నుంచి ఎగురుతున్న చిలుక ఛాయా చిత్రం కూడా నేలపై రికార్డ్ అయింది. అలా ఓ నిమిషంపాటు గాల్లో మొబైల్ ఫోన్‌తో విహరించిన ఆ చిలుక ఓ ఇంటి రూఫ్ మీద కూర్చున్నది. ఆ తరువాత అక్కడి నుంచి ఓ కారుపై వాలినట్టు వీడియోలో రికార్డ్ అయింది. దీనికి సంబందించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్నది.
Read: వైరస్‌కన్నా ఈ చేప చాలా డేంజర్… ఎందుకంటే…