Dhurandhar 2 Teaser: ‘ధురంధర్ 2’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. హైప్ పీక్స్‌కు!
- మంగళవారం ‘ధురంధర్ 2’ టీజర్ విడుదల
- రణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్
- ట్రెండింగ్‌లో ధురంధర్ 2 సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ టీజర్ రేపు విడుదల కాబోతోంది. మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హీరో రణ్‌వీర్ సింగ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో హైప్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఎక్స్‌లో ధురంధర్ 2, రణ్‌వీర్ సింగ్ పేర్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఇది కేవలం ఓ టీజర్ రిలీజ్ కాదు.. అభిమానుల కోసం ఓ స్పెషల్ మూమెంట్ అని చిత్ర బృందం హింట్ ఇస్తోంది. ‘ఇది డ్రిల్ కాదు.. ఇది కేవలం హైప్ మాత్రమే కాదు.. ఇది ఓ క్షణం’ అంటూ మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ ధురంధర్ 2పై ఆసక్తిని మరింత పెంచింది. ధురంధర్ సిరీస్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ దృష్ట్యా ఈ టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ్యాడ్‌నెస్, మేహెమ్, మాసివ్ స్కేల్.. ఇవే ధురంధర్ 2 టీజర్ కీలక హైలైట్స్‌గా ఉండబోతున్నాయట. యాక్షన్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. అన్ని కలిసి ప్రేక్షకులకు వేరే లెవల్ అనుభూతి ఇవ్వనున్నాయనే టాక్ వినిపిస్తోంది.
Also Read
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
రెండు నెలలుగా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2025 డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పటికే రూ.1400 కోట్లు కొల్లగొట్టింది. థియేటర్లలో హిందీ భాషలోనే విడుదలైన ధురంధర్.. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. రణ్‌వీర్ సింగ్ లుక్స్, యాక్టింగ్.. విలన్‌గా అక్షయ్ ఖన్నా పెర్ఫామెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని సమాచారం.
తాజావార్తలు
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!